ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బాలయ్య మళ్లీ అక్కడినుంచే' - chandrababu

నందమూరి బాలకృష్ణను మళ్లీ హిందూపురం నుంచే పోటీ చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు.

బాలకృష్ణ మళ్లీ హిందూపురం నుంచే

By

Published : Mar 8, 2019, 7:04 AM IST

బాలకృష్ణ మళ్లీ హిందూపురం నుంచే

అమరావతి ప్రజావేదికలో హిందూపురం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల అభ్యర్థులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. హిందూపురం పార్లమెంట్ స్థానాన్ని సిట్టింగ్ ఎంపీ నిమ్మల కిష్టప్పకు ఖరారు చేశారు. అసెంబ్లీ స్థానాన్ని మళ్లీ బాలకృష్ణకే కేటాయించారు. పెనుగొండ నుంచి పార్థసారథి... పుట్టపర్తి నుంచి పల్లె వైపే మొగ్గు చూపారు.

ధర్మవరం నుంచి వరదాపురం సూరిని ఖరారు చేశారు. మడకశిర నుంచి వీరన్నకు తిరిగి అవకాశమిచ్చారు. రాప్తాడు నుంచి పరిటాల సునీత మళ్లీ బరిలోకి దిగనున్నారు. కదిరి స్థానానికి కందికుంట ప్రసాద్​ను ఖరారు చేశారు. చాంద్ పాషాను కలుపుకుని వెళ్లాల్సిందిగా కందికుంటకు సూచించారు. చాంద్ పాషాకి సముచిత స్థానం కల్పిస్తానని అధినేత హామీఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details