ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Balakrishna: ఎమ్మెల్యే బాలకృష్ణ ఉదారత... బ్లాక్ ఫంగస్​ రోగికి మందులు అందజేత - Balakrishna sent medicines to a black fungus patient

ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Balakrishna) మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. బ్లాక్​ ఫంగస్​ సోకిన వ్యక్తికి మందులు దొరకక బాలకృష్ణను సంప్రదించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే బాధితుడికి అవసరమైన మందులను పంపారు. ఎమ్మెల్యే బాలకృష్ణకు బాధిత కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Balakrishna
ఎమ్మెల్యే బాలకృష్ణ ఉదారత

By

Published : Jun 16, 2021, 5:07 PM IST

అనంతపురం జిల్లా హిందూపురం మండలం కిరికెర గ్రామానికి చెందిన సిద్ధారెడ్డికి బ్లాక్ ఫంగస్ సోకింది. అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సరైన మందులు దొరకకపోవడంతో సిద్ధారెడ్డి కుమార్తె.. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను సంప్రదించింది. వెంటనే స్పందించిన బాలకృష్ణ.. చికిత్సకు అవసరమైన మందులను స్థానిక తెదేపా నాయకులతో సిద్ధారెడ్డి కుటుంబానికి అందించారు. ఎమ్మెల్యే బాలకృష్ణకు బాధిత కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

తన నాన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు అవసరమైన మందులను ఎమ్మెల్యే బాలకృష్ణ పంపారని సిద్ధారెడి కుమార్తె తెలిపారు. రోజు ఫోన్​ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవారన్నారు. చికిత్స అనంతరం ఇంటికి వచ్చిన తర్వాత కూడా అవసరమైన మందులను కూడా స్థానిక నాయకులు ద్వారా పంపించటం ఆనందంగా ఉందన్నారు.

ఇదీ చదవండి:Balakrishna: హిందూపురానికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపిన ఎమ్మెల్యే బాలకృష్ణ

ABOUT THE AUTHOR

...view details