అనంతపురం జిల్లా హిందూపురంలో తెదేపా అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు.పట్టణంలోని సూగూరు ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్యకర్తలు, అభిమానులతో ర్యాలీగా వెళ్లారు. తహశీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. తెదేపా బడుగు బలహీన వర్గాల నుంచి పుట్టిందని చెప్పారు. పార్టీపైకొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు గమనించాలన్నారు. ఎవరెన్ని చేసినా అధికారంలోకి రాబోయేది తెలుగుదేశం పార్టీనేనని చెప్పారు. 150కి పైగా సీట్లలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హిందూపురం నియోజకవర్గం అభివృద్ధిలో ముందంజలో ఉందని.. రానున్న రోజుల్లో మరో బెంగళూరు నగరంగా హిందూపురాన్నితీర్చిదిద్దుతానని బాలకృష్ణహామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..