ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండేళ్ల హిందూపురం అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: బాలకృష్ణ - బాలకృష్ణ వార్తలు

బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడితే.. వైకాపా ప్రభుత్వానికి కాలం చెల్లినట్లేనని... హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. హిందూపురంలోని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాలకృష్ణ... ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

balayya
బాలకృష్ణ

By

Published : Mar 4, 2021, 12:43 PM IST

వైకాపా ప్రభుత్వంపై తెదేపా ఎమ్మెల్యే బాలకృష్ణ ధ్వజం

అనంతపురం జిల్లా హిందూపురంలో తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో నలుగురు మంత్రులు మాఫియా నడుపుతున్నారని ఆరోపించారు. హిందూపురంలో రెండేళ్ల అభివృద్ధిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ప్రజలు తిరగబడే రోజు వస్తుందని గుర్తుంచుకోవాలని వైకాపా నాయకులను హెచ్చరించారు. అధికార పార్టీ నేతలు ఇంకా బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడితే.. ఆ పార్టీకి కాలం చెల్లినట్లేనని బాలకృష్ణ అన్నారు. వైకాపా ప్రభుత్వం వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details