ఖరీఫ్ ప్రారంభమై నెలవుతున్నా... వేరుశనగ విత్తనాల సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ధ్వజమెత్తారు. విత్తనాలు, ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్న బాలకృష్ణ... రైతు ప్రభుత్వమని చెప్పుకునే వైకాపా... రైతులను ఇబ్బంది పెడుతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వం వెంటనే మేల్కొని రైతుసమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ ఇలాంటి దుస్థితి లేదన్న బాలయ్య... గ్రామాలకూ 24 గంటల విద్యుత్ సరఫరా ఘనత తెదేపాదేనని పేర్కొన్నారు. ప్రస్తుతం విద్యుత్ కోతల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు.
రైతులకు ఇలాంటి దుస్థితి ఎప్పుడూ రాలేదు: బాలకృష్ణ
ఖరీఫ్ ప్రారంభమైనా... డిమాండ్ మేరకు వేరుశనగ విత్తనాలు సరఫరా చేయకపోవడంపై హిదూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే రైతులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
రైతులకు ఇలాంటి దుస్థితి ఎప్పుడూ రాలేదు: బాలకృష్ణ