మహా శివరాత్రి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లేపాక్షి ఆలయ బ్రహ్మోత్సవాల్లో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు. తన సతీమణి వసుంధరతో కలిసి శ్రీ దుర్గా పాపనాశేశ్వర వీరభద్ర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ దంపతులు ఆలయంలోని శిల్ప నైపుణ్యతను పరిశీలించారు. రాష్ట్ర ప్రజలకు బాలకృష్ణ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు.