ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుత్తిలో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు - అనంతపురం జిల్లా నేటి వార్తలు

అనంతపురం జిల్లా గుత్తిలో ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని నిర్వహించారు. స్థానిక గాంధీ కూడలి నుంచి ఎన్టీఆర్ కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. 75 వారాలు జరిగే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్.. 2022 ఆగస్టు 15 వరకు కొనసాగుతుందని జేసీ అన్నారు.

Azadi ka Amrit Mahotsava celebrations in Gutti ananthapuram district
గుత్తిలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ వేడుకలు

By

Published : Mar 24, 2021, 9:38 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా... అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని స్థానిక జాయింట్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. గాంధీ కూడలి నుంచి ఎన్టీఆర్ కూడలి వరకు చేపట్టిన ఈ ర్యాలీలో పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం హంపన్న సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఏడాదిన్నర పాటు 75 వారాలు జరిగే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు.. 2022 ఆగస్టు 15 వరకు కొనసాగుతాయని జేసీ అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో చిరస్థాయిగా నిలిచిపోయిన దండియాత్రను గుర్తుచేసుకుంటూ సబర్మతీ ఆశ్రమం నుంచి నవసారిలోని దండి వరకు 241 మైళ్ల దూరం పాదయాత్రను నిర్వహిస్తున్నారన్నారు. ఈ పాదయాత్ర 25 రోజులు పాటు సాగి ఏప్రిల్ 5న దండిలో ముగుస్తుందని ఆయన చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details