దేశవ్యాప్తంగా వేగంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ను నియంత్రించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలపై అనంతపురం జిల్లా గుంతకల్లులో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దగ్గు, జ్వరం, కీళ్లనొప్పులు వంటి లక్షణాలు ఉంటే వారి కోసం ప్రత్యేక అంబులెన్సులను సిద్ధం చేసి ముగ్గురు సిబ్బందిని నియమిస్తామని వైద్యులు తెలిపారు. ప్రథమ చికిత్స అనంతరం తీవ్రత ఎక్కువగా ఉంటే వారిని ఐసోలేషన్ వార్డులకు తరలించి పరిశీలనలో ఉంచుతామని అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు. శానిటైజర్లు, సబ్బులతో చేతులు కడుక్కోవడం, దగ్గే వారికి, తుమ్మే వారికి దూరంగా ఉండాలని చెప్పారు. ప్రజలందరూ సామాజిక బాధ్యతతో సామాజిక దూరాన్ని పాటించాలని ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించారు.
గుంతకల్లులో కరోనా పై ప్రజలకు మాక్ డ్రిల్ - mack drill'
కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయడానికి అనంతపురంజిల్లా గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు మాక్ డ్రిల్ నిర్వహించారు. వైరస్ సోకకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

గుంతకల్లులో కరోనా పై ప్రజలకు మాక్ డ్రిల్