ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పట్టు రైతులు రాయితీలను సద్వినియోగం చేసుకోండి' - మడకశిరలో పట్టు పరిశ్రమ జేడీ పద్మమ్మ

పట్టు రైతులకు ప్రభుత్వం అందించే రాయితీలపై అనంతపురం జిల్లా మడకశిరలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పట్టు పరిశ్రమ జేడీ పద్మమ్మ పాల్గొని రాయితీల గురించి వివరించారు.

awareness program
పట్టు రైతులకు అవగాహన సదస్సు

By

Published : Nov 19, 2020, 10:45 AM IST

పట్టు సాగు చేస్తున్న ఎస్సీ రైతులు ప్రభుత్వం అందించే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని పట్టు పరిశ్రమ జేడీ పద్మమ్మ సూచించారు. అనంతపురం జిల్లా మడకశిరలో రాయితీపై రైతులకు అవగాహన కల్పించారు. పట్టు రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలు అమలు చేస్తున్నాయని జేడీ తెలిపారు. షెడ్ల నిర్మాణం, మల్బరీ మొక్కల పెంపకానికి 90 శాతం రాయితీని అందిస్తున్నాయని చెప్పారు. వీటిని రైతులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details