మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు ఓటు హక్కు వినియోగంపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. అనంతపురం మున్సిపాలిటీలోని పోలీస్ స్టేషన్ల పరిధిలోని సీఐలు.. ఆయా ప్రాంతాల్లో పర్యటించి ప్రజలందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసులకు సహకరించాలన్నారు.
ఓటర్లను మద్యం, డబ్బుతో ఎవరైనా ప్రలోభ పెట్టినట్లు గుర్తిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. మార్చి10న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అనంతపురం పోలీసులు ఆయా కాలనీల్లో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఎక్కడైనా చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.