అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో ప్యాంపర్స్ సంస్థవారు చిన్న పిల్లల ఆరోగ్య సంరక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తల్లి పాల విశిష్ఠత, చిన్నారుల పట్ల తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిశుభ్రత అంశాలపై అవగాహన కల్పించారు. ప్యాంపర్స్ వాడడం వల్ల కలిగే ప్రయోజనాలు, అరికట్టే సమస్యల గురించి తెలిపారు. కార్యక్రమానికి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, జిల్లా ఐసీడీఎస్ పీడీ చిన్మయాదేవి, హెచ్ఓడీ మల్లేశ్వరి హాజరయ్యారు.
చిన్నారుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన కార్యక్రమం - childrens health care
అనంతపురంలోని మెడికల్ కళాశాల కౌన్సిల్ సమావేశ మందిరంలో ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో ప్యాంపర్స్ సంస్థ వారు చిన్నారుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన కార్యక్రమానికి ఏర్పాటు చేశారు.
![చిన్నారుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన కార్యక్రమం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4162899-955-4162899-1566052169798.jpg)
awareness program on childrens health in ananthapuram district
ఈనాడు ఆధ్వర్యంలో చిన్నారుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన కార్యక్రమం