ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పట్టాలు మంజూరు చేసిన ఇళ్ల స్థలాల్లో కార్యాలయాలు ఏర్పాటు మానుకోవాలి' - villagers protest for their house news update

పట్టాలు మంజూరు చేసిన ఇళ్ల స్థలాల్లో అధికారులు ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించరాదంటూ అనంతపురం జిల్లా మడకశిర మండలం వై.బి. హళ్ళి గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. ఆ స్థలాల్లో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఆరోపించిన వారు రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందజేశారు.

villagers protest
ఇళ్ల స్థలాల్లో కార్యాలయాలు ఏర్పాటు మానుకోవాలంటూ గ్రామస్థుల ఆందోళన

By

Published : Jul 17, 2020, 11:47 PM IST

అనంతపురం జిల్లా మడకశిర మండలం వై.బి. హళ్ళి గ్రామస్థులు ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఇంటి స్థలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించరాదని ఆందోళన చేపట్టారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. వై.యస్. రాజశేఖర్​రెడ్డి హయాంలో 26 కుటుంబాలకు పట్టాలు మంజూరు చేసారన్నారు. ప్రస్తుతం ఆ స్థలంలో ఇండ్లు పూర్తి నిర్మాణం అయి ఉన్నాయని, పునాది బిల్లులు మంజూరు అయ్యాయని తెలిపారు. అధికారులు ఆ స్థలాల్లో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఆరోపించారు. గ్రామపంచాయతీలో తీర్మానం చేయకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. . ఇలా చేస్తే 26 కుటుంబాలు నష్టపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు ప్రజలకు అనుకూలంగా ఉన్న వేరే చోట ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని బాధితులు కోరారు.

ABOUT THE AUTHOR

...view details