అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ శివారులోని కొట్టాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరోముగ్గురు తీవ్రంగా గాయలయ్యాయి. గుంతకల్లు పరిధిలోని జీ.కొట్టాల గ్రామానికి చెందిన పెద్దయ్య(56) పట్టణంలో పనులు ముగించుకొని తమ గ్రామానికి ఆటోలో వెళుతుండగా....గుంతకల్లు వైపుగా వస్తున్న స్కూటర్ ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పెద్దయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. స్కూటర్లో వస్తున్న వెంకటేశ్వర్లు, జయప్రకాష్, సతీష్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో, ద్విచక్రవాహనం ఢీ.... ఒకరి మృతి, మరో ముగ్గురికి గాయాలు - ఆటో, ద్విచక్రవాహనం ఢీ.... ఒకరి మృతి మరో ముగ్గురికి గాయాలు
ఆటో, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న పెద్దయ్య అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందగా... బైక్‌పై వచ్చిన ముగ్గురికి తీవ్రగాయాలైన ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు వద్ద చోటుచేసుకుంది.
ఆటో, ద్విచక్రవాహనం ఢీ.... ఒకరి మృతి, మరో ముగ్గురికి గాయాలు
Last Updated : Oct 16, 2019, 12:23 AM IST