ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దర్శనమలలో ఆటో బోల్తా...ఒకరు మృతి...నలుగురికి గాయాలు - Auto roll over in darshanamala

ధర్మవరం మండలం దర్శనమల గ్రామంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా... మరో నలుగురికి గాయాలయ్యాయి.

Auto roll over in darshanamala ananthapur district
దర్శనమలలో ఆటో బోల్తా...ఒకరు మృతి...నలుగురికి గాయాలు

By

Published : Nov 22, 2020, 12:45 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరం మండలం దర్శనమలలో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో భవన నిర్మాణ కార్మికుడు చంద్రప్ప మృతి చెందాడు. మరో నలుగురు గాయపడ్డారు. దర్బార్ పట్టణం చిన్నూరు కాలనీకి చెందిన భవన నిర్మాణ కార్మికులు పని నిమిత్తం దర్శనమల గ్రామానికి వెళ్తుండగా...ఆటో ఆదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అశోక్, రుక్మిణమ్మ, శంకర్, ఆటో డ్రైవర్ శ్రీనివాసులు గాయపడ్డారు. వీరిని ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

ఇదీ చదవండి:

' అర్ధరాత్రి నిర్బంధాలు ఏమిటి.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?'

ABOUT THE AUTHOR

...view details