అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని వినాయక సర్కిల్లో ఆటో డ్రైవర్లు.. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వాహన మిత్ర పథకం ద్వారా ఆటో కార్మికులకు రెండో విడతలో భాగంగా రూ.10 వేలు మంజూరు చేయడంపై వారు ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆటో కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించిందని కాపు రామచంద్రారెడ్డి చెప్పారు.
'ఆటో డ్రైవర్లను ఆదుకున్న సీఎంకు కృతజ్ఞతలు' - రాయదుర్గం ఆఠో డ్రైవర్లు తాజా వార్తలు
ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించి ఆదుకున్న సీఎం జగన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రభుత్వ విప్ కాపు రామచంద్రా రెడ్డి తెలిపారు. రాయదుర్గం వినాయక సర్కిల్లో ముఖ్యమంత్రి చిత్రపటానికి ఆటోడ్రైవర్లు పాలాభిషేకం చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు.
రాయదుర్గంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఆటోడ్రైవర్లు