ఆటో డ్రైవర్ కిరాయికి రానందుకు మద్యం మత్తులో నలుగురు వ్యక్తులు అతనిని రాయితో మోది చంపారు. ఈ ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో జరిగింది. పట్టణంలోని టైలర్స్ కాలనీకి చెందిన 29 ఏళ్ల దస్తగిరి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రాత్రి 12 గంటల వరకు దస్తగిరి ఆటో నడిపి తన సోదరుడు చిన్న దస్తగిరితో కలిసి ఇంటికి బయల్దేరాడు.
మద్యం మత్తులో రాళ్ల దాడి: ఆటో డ్రైవర్ మృతి - తాడిపత్రిలో ఆటో డ్రైవర్ హత్య
ఓ ఆటో డ్రైవర్ కిరాయికి పిలిస్తే రాలేదని అతన్ని నలుగురు వ్యక్తులు రాయితో మోది చంపారు. ఈ ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

కాలనీ సమీపంలోకి రాగానే మద్యం మత్తులో ఉన్న నలుగురు వ్యక్తులు ఆటోను ఆపి కిరాయికి రావాలంటూ పిలిచారు. తాను ఇంటికి వెళ్తున్నానని ఈ సమయంలో కిరాయికి రాను అని దస్తగిరి చెప్పాడు. ఆగ్రహించిన ఆ నలుగురు వ్యక్తులు వాగ్వాదానికి దిగారు. ఘర్షణ తీవ్రస్థాయికి చేరగా... ఆది అనే వ్యక్తి రాయితో ఆటో డ్రైవర్ని కొట్టాడు. అతని సోదరుడిపై మిగతావాళ్లు దాడి చేశారు. ఈ ఘటనలో దస్తగిరి అక్కడికక్కడే మృతిచెందగా... అతని సోదరుడు చిన్న దస్తగిరికి తీవ్ర గాయాలయ్యాయి. పట్టణ సీఐ తేజమూర్తి సిబ్బందితో కలిసి హత్య చేసిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీచూడండి.చింతపండు ధర ఉంది.. దిగుబడే లేదు..!