అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం రాట్నాపల్లి జాతీయ రహదారి 42పై ప్రమాదం జరిగింది. ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొట్టటంతో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తి గాండ్లపెంట మండలం కటారుపల్లికి చెందిన ఆటో డ్రైవర్ శేషగిరిగా గుర్తించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను కదిరి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.
ఆటోని ఢీకొట్టిన లారీ... డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
అనంతపురం జిల్లా రాట్నాలపల్లి వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఆటోను లారీ వెనుక నుంచి ఢీ కొట్టటంతో, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.
రోడ్డు ప్రమాదం