ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కూలీల ఆటో బోల్తా..  ఎనిమిది మందికి గాయాలు - కల్యాణ దుర్గంలో రోడ్డు ప్రమాదం

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పులికల్లు సమీపంలో ఆటో బోల్తా పడి ఎనిమిది మందికి గాయాలయ్యాయి. మల్లికార్జున పల్లి నుంచి నరసాపురం వైపు కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో ప్రమాదం జరిగింది.

auto accident at pulikalla
కూలీల ఆటో బోల్తా

By

Published : Jul 22, 2020, 10:45 AM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పులికల్లు సమీపంలో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. మల్లికార్జున పల్లి నుంచి నరసాపురం వైపు కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన పరిసర ప్రాంతాల్లో రైతులు హుటాహుటిన కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని.. వీరిని అనంతపురం తరలిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details