ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ పరిధిలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. కర్ణాటకలోని బళ్ళారి నుంచి ఏపీలోకి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారంటూ.. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించినట్లు సెబ్ అధికారి శ్యాం ప్రసాద్ తెలిపారు.
కర్ణాటక అక్రమ మద్యం పట్టివేత... ఒకరు అరెస్ట్ - అక్రమ మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ వార్తలు
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ పరిధిలో గురువారం భారీగా కర్ణాటక మద్యాన్ని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. 2500 మద్యం టెట్రా ప్యాకెట్లుతో పాటు ఒక ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశారు.
వీరిలో ఇద్దరు నిందితులు మద్యాన్ని అక్కడే వదిలి పరారవ్వగా.. మరో నిందితుడిని ద్విచక్రవాహనంతో పాటు పట్టుకున్నట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న 2,500 మద్యం టెట్రా ప్యాకెట్లుతో పాటు.. ఒక ద్విచక్రవాహనాన్ని సీజ్ చేసినట్లు శ్యాం ప్రసాద్ పేర్కొన్నారు. మద్యం టెట్రా ప్యాకెట్ల విలువ సుమారు రూ. 81 వేలు కాగా.. బహిరంగ మార్కెట్లో రూ. 2 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. స్థానిక ఎన్నికలు జరుగుతున్న కారణంగా.. అక్రమ మద్యం రవాణాపై మరింత నిఘా పెడతామని అధికారులు అన్నారు.