ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

18లక్షల విలువైన వేరుశెనగ బస్తాలు ఏమయ్యాయి?

అనంతపురంజిల్లాలోని వ్యవసాయ అధికారులు, విజిలెన్స్ అధికారులు 2 రోజులపాటు ఉరవకొండ వ్యవసాయ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా నకిలీ టోకెన్లు సృష్టించి, లక్షల విలువైన విత్తనాలు పక్కదారి పట్టించిన అధికారులను సస్పెండు చేశారు.

Authorities have suspended millions of fake tokens by creating counterfeit tokensat ananthpuram district

By

Published : Jul 24, 2019, 2:30 PM IST

పేద రైతులకు అందాల్సిన సబ్సిడీ వేరుశనగ విత్తనాలను ఇంటి దొంగలే కాజేస్తున్న ఘటన అనంతపురంజిల్లా ఉరవకొండ వ్యవసాయ కార్యాలయంలో చోటుచేసుకుంది. ఈ మార్కెట్ యార్డులోని పంపిణీ కేంద్రంలో మూడువేల ఆరువందల నకిలీ టోకెన్లు, రసీదులతో పదెన్నిమిది లక్షలు విలువచేసే, ఒక వేయ్యి పన్నెండు వేరుశనగ బస్తాలను విత్తన పర్మిట్లను సృష్టించి ఏకంగా గోదామునుంచి మాయం చేసారు. ఈ అక్రమదందా గురించి విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వ్యవసాయ, విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా రెండు రోజులపాటు వ్యవసాయ కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఒక వేయ్యి పన్నెండు వేరుశనగ బస్తాలు తేడా వచ్చిందని గుర్తించగా, దీనిపై కలెక్టర్ ఆదేశాల మేరకు గోదాము వద్ద విధులు నిర్వహిస్తున్న నలుగురు ఎంపీఈవోలను సస్పెండ్ చేస్తూ, మండల వ్యవసాయ అధికారికి మెమో జారీ చేసారు. గత రెండు రోజుల కిందట విడపనకల్లు మండలం, వేల్పుమడుగు గ్రామంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన దళారుల పై కేసునమోదు చేసారు.

నకిలీ రశీదులతో 18లక్షల విలువైన వేరుశెనగ బస్తాలు మాయం...

ABOUT THE AUTHOR

...view details