అనంతపురం శివారు ప్రాంతంలోని సోములదొడ్డి సమీపంలో భారీ మొత్తంలో మద్యం బాటిళ్లను ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. ఐఎంఎల్ మద్యం నిల్వ ఉంచే డిపోలో కాలం చెల్లిన బీర్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటిని ధ్వంసం చేశారు. 2,272 కేసుల బీర్ బాక్సులో ఉన్న 27,264 మద్యం సీసాలను ధ్వంసం చేశారు. అందులో ఎక్కువ మొత్తంలో బడ్‌వైజర్ బాటిళ్లను గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.5 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. మాములుగా బీర్ బాటిల్స్‌కు ఆరు నెలల కాల వ్యవధి మాత్రమే ఉంటుందన్నారు. కాలం చెల్లిన మద్యాన్ని నిల్వ ఉంచితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
భారీగా బీరు పారబోశారు.. ఎక్కడంటే..? - alcohol destroyed in anantapur district
గ్లాసులో ఉన్న బీరు కింద పడిపోతేనే.. మందుబాబులకు గుండె జారిపోతుంది. అలాంటిది ఏకంగా 27,264 బీర్ సీసాలను ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేసి... మద్యాన్ని ఏరులా పారించారు. ఆ వీడియోను చూసిన మందుల బాధ వర్ణనాతీతం. ఇంతకీ అధికారులు వాటిని ఎందుకు ధ్వంసం చేశారు ? ఈ ఘటన ఎక్కడ జరిగింది? తెలుసుకోవాలనుకుంటున్నారా.. ? అయితే ఇది చదవండి..
alcohol destroyed