ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏటీఎంలో చోరీకి యత్నం.. మొరాయించిన యత్రం - అనంతపురంలో ఏటీఎంలో చోరీ వార్తలు

అనంతపురం జిల్లా విడపనకల్​లోని ఓ ఏటీఎంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి యత్నించారు. మిషన్​ని పగలకొట్టేందుకు చాలా శ్రమించారు. కానీ అది తెరుచుకోకపోవడంతో రోడ్డుపైనే పడేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా విడపనకల్​లో జరిగింది.

Attempting to steal ATM at midapanakal in ananthapur distict
Attempting to steal ATM at midapanakal in ananthapur distict

By

Published : Jun 2, 2020, 11:46 AM IST

అనంతపురం జిల్లా విడపనకల్ మండలంలో మంగళవారం తెల్లవారుజామున ఏటీఎంలో చోరీకి విఫలయత్నం జరిగింది. 42వ జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ బ్యాంకు ఏటీఎంలో.. నగదు చోరీ చేయడానికి దుండగులు తీవ్రంగా ప్రయత్నించారు. అర్ధరాత్రి సమయంలో చొరబడి ఏటీఎం మిషన్​ని ధ్వంసం చేసి డబ్బులు ఎత్తుకెళ్లాలనుకున్నారు. కానీ ఏటీఎం తెరుచుకోకపోవడంతో రోడ్డుపైనే పడేసి... పరారయ్యారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details