అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణను అడ్డుకునేందుకు ఎంపీ రంగయ్య వర్గీయులు యత్నించారు. కల్యాణదుర్గం, రాయదుర్గంలో అభివృద్ధి పనుల్లో పాల్గొనేందుకు మంత్రి బొత్స వచ్చారు. మంత్రి పర్యటన నేపథ్యంలో... ఆదివారం రాత్రి ఎంపీ రంగయ్య, ఎమ్మెల్యే ఉషశ్రీ వర్గీయుల మధ్య వివాదం జరిగింది. తమ ఫ్లెక్సీలు .. ఎమ్మెల్యే ఉష శ్రీ వర్గీయులు తొలగించారని ఆరోపిస్తూ ఎంపీ రంగయ్య వర్గీయులు మంత్రి బొత్స ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పార్టీని, కార్యకర్తలను ఎమ్మెల్యే ఉషశ్రీ పట్టించుకోవట్లేదంటూ ఆరోపించారు.
కల్యాణదుర్గంలో మంత్రి బొత్సను అడ్డుకునేందుకు యత్నం - minister botsa satyanarayana convoy
కల్యాణదుర్గంలో మంత్రి బొత్స పర్యటనలో కొంత ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే ఉషశ్రీ కార్యకర్తలను పట్టించుకోవటం లేదని ఆరోపిస్తూ ఎంపీ రంగయ్య వర్గీయులు మంత్రిని అడ్డుకునేందుకు యత్నించారు.
![కల్యాణదుర్గంలో మంత్రి బొత్సను అడ్డుకునేందుకు యత్నం minister botsa satyanarayana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9636499-278-9636499-1606129699678.jpg)
minister botsa satyanarayana
కల్యాణదుర్గంలో మంత్రి బొత్సను అడ్డుకునేందుకు యత్నం
Last Updated : Nov 23, 2020, 5:05 PM IST