ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలం అరివేముల గ్రామ వ్యవసాయ పొలాల్లో పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎనిమిదిమంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి 41వేల 810 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు. చంద్రశేఖరపురం ఎస్సై, వారి సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. అరెస్టు చేసిన వారిని కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్సై శివ బసవరాజు తెలిపారు.
గుడిలోనే పేకాట...
పేకాట ఆడటానికి ఎక్కడ చోటు లేదని.... ఆ పేకాటరాయుళ్లు అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ సమీపంలోని కోనేరు పాత మండపాలను పేకాటకు అడ్డాగా చేసుకున్నారు.
ఉరవకొండ సర్కిల్ సీఐబీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించారు. కళ్యాణదుర్గం మండలం ముద్దినాయనపల్లి గ్రామానికి చెందిన 8 మంది పేకాటరాయుళ్లను...పెన్న హోబిలంలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవాలయం వద్ద అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.72 వేల నగదు. రెండు వాహనాలు, పది చరవాణీలు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి:బీ అలర్ట్: కస్టమర్ కేర్ అంటారు... ఖాతాలు ఖాళీ చేస్తారు!