అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ సమైక్య సమితి అధ్యక్షుడు విరూప శ్రీనివాసులు డిమాండ్ చేశారు. స్థానిక పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద ఆయన దళిత నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. గతవారంలో... ఎఫ్ఐఆర్ కాపీ కావాలని గుమ్మగట్ట పోలీస్ స్టేషన్‌కి వెళితే, వీరాపురం గ్రామానికి చెందిన సమైక్య సమితి జిల్లా అధ్యక్షుడు రఘునాథరెడ్డిపై దుర్భాషలాడిన ఘటన సంచలనం రేపిందన్నారు. హెడ్‌కానిస్టేబుల్ రఘనాథ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి, కేసు నమోదు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్లో దళితులకు న్యాయం జరగడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ సమైక్య సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు క్రిష్టప్ప, నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దళితులపై దాడులను అరికట్టాలి... - ఈటీవీ భారత్ తాజా వార్తలు
అనంతపురం జిల్లా రాయదుర్గంలోని దళితులపై జరిగే దాడులను అరికట్టాలని, రాష్ట్ర సమైక్య సమితి కార్యదర్శి అధ్యక్షుడు విరూప శ్రీనివాసులు డిమాండ్ చేశారు. రక్షణ కల్పించాల్సిన పోలీస్టేషన్లో దళితులకు న్యాయం జరగడంలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
దళితులపై దాడులను అరికట్టాలి