ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధర్మవరంలో ఇరు పార్టీల కార్యకర్తల ఘర్షణ... ఇద్దరికి గాయాలు - ధర్మవరంలో ఇరుపార్టీల వ్యక్తుల మధ్య ఘర్షణలు

చిన్నపాటి వివాదంలో మాటలు పెరిగి ఇరుపార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ గొడవ అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగింది.

ధర్మవరంలో ఇరుపార్టీల ఘర్షణలు... ఇద్దరికి గాయాలు

By

Published : Nov 19, 2019, 10:17 AM IST

ధర్మవరంలో ఇరు పార్టీల ఘర్షణ... ఇద్దరికి గాయాలు

అనంతపురం జిల్లా ధర్మవరంలో ఇరువర్గాల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. తెదేపా కార్యకర్త నాగేంద్ర... వైకాపా నాయకుడు గడ్డం కుమార్​ అనే వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో కుమార్​తో పాటు గొడవను అడ్డుకోబోయిన మహమ్మద్ రఫీకి గాయాలయ్యాయి. బాధితులిద్దరినీ గ్రామస్తులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు... ఆసుపత్రికి చేరుకుని కుమార్ నుంచి వివరాలు సేకరించారు. కూరగాయల మార్కెట్లో తెల్లవారుజామున ఇద్దరి మధ్య మాటలు పెరిగి ఘర్షణకు దారి తీసినట్లు స్థానికులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details