పెనుకొండలో లీగల్ మెట్రాలజీ అధికారుల దాడులు
అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలో నిత్యావసర దుకాణాలపై మెట్రాలజీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అధిక ధరలకు విక్రయాలు జరుపుతున్న దుకాణదారులపై 11 కేసులు నమోదు చేశారు.
అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలో నిత్యావసర దుకాణాలు, కూరగాయలు, ఔషధ దుకాణాలపై లీగల్ మెట్రాలజీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అధిక ధరలకు నిత్యావసర వస్తువులు అమ్ముతున్న దుకాణదారుల పై పదకొండు కేసులు నమోదు చేయగా ప్యాకేజి వస్తువుల పై తయారీదారుని వివరాలు, అమ్మకపు ధర, తయారైన నెల ఇతర వివరాలు లేనందున మరో మూడు నమోదు చేశారు. మెుత్తం పద్నాలుగు కేసులు నమోదు చేసి రూ. 1,05,000 అపరాధ రుసుమును విధించారు. ఈ దాడులలో అసిస్టెంట్ కంట్రోలర్ స్వామి, ఇన్స్పెక్టర్ ఎం. మహమ్మద్ గౌస్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ రమేశ్ పాల్గొన్నారు.