అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం గుమ్మల్లకుంట వైకాపాలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వైకాపా మండల కన్వీనర్ భయపు రెడ్డిపై అదే పార్టీకి చెందిన ప్రత్యర్థులు దాడి చేశారు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న భయపు రెడ్డిపై అదే గ్రామానికి చెందిన అమర్నాథ్ రెడ్డి, బాలరెడ్డి తదితరులు కర్రలతో దాడి చేశారు. చికిత్స నిమిత్తం అతనిని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న భయపు రెడ్డి వర్గీయులు..బత్తలపల్లిలో అమర్నాథ్ రెడ్డిపై దాడి చేశారు. గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు.