ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యోగివేమన ప్రాజెక్టు వద్ద వేటకొడవళ్లతో దాడి.. ఒకరు మృతి - anantapur district news

అనంతపురం జిల్లా యోగివేమన ప్రాజెక్టు వద్ద ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. మృతులకు సంబంధించిన వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

murder in Anantapur district
యోగివేమన ప్రాజెక్టు వద్ద వేటకొడవళ్లతో దాడి

By

Published : May 17, 2021, 12:45 PM IST

అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం యోగివేమన ప్రాజెక్టు వద్ద ఇద్దరిపై దాడి జరిగింది. ద్విచక్ర వాహనంలో ప్రధాన రహదారిపై వెళ్తున్న ఇద్దరిపై ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో 35 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై ముదిగుబ్బ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details