అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో తెదేపా నాయకుడు ప్యారం కేశవనందపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్న సమయంలో ఆయనపై నలుగురు వ్యక్తులు కర్రలతో దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ముఖం, వీపు భాగాల్లో తీవ్రంగా గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో హుటాహుటిన జిల్లా కేంద్రం అనంతపురం తరలించారు. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని తెదేపా కార్యకర్తలు, నాయకులు డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వంలో తెదేపా కార్యకర్తలను లక్షంగా చేసుకొని దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
ఉరవకొండ పట్టణంలో తెదేపా నాయకుడిపై దాడి - Attack on TDP leader in Uravakonda town latest news
ఉరవకొండ పట్టణంలో తెదేపా నాయకుడు ప్యారం కేశవనందపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని తెదేపా కార్యకర్తలు, నాయకులు డిమాండ్ చేశారు.
ఉరవకొండ పట్టణంలో తెదేపా నాయకుడిపై దాడి