అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలో పులుగుట్టపల్లి, పెద్దతండ, మల్లేనిపల్లి, గుండాల తండా గ్రామాల్లో నాటుసారా స్థావరాలపై ఎస్ఈబీ అధికారులు మెరుపుదాడులు చేశారు. 27,000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 30 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నాటుసారా తయారీదారులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఈబీ అధికారులు తెలిపారు. నాటుసారా తయారు చేసినా, విక్రయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
నాటుసారా స్థావరాలపై దాడులు..భారీగా బెల్లం ఊట ధ్వంసం - నాటు సారా స్థావరాలపై వార్తలు
అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలో నాటుసారా స్థావరాలపై ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. 27,000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
నాటుసారా స్థావరాలపై దాడులు
పెద్దవడుగూరు మండలం విరుపాపురం గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన 50 లీటర్ల నాటుసారాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు. పోలీసులు వస్తున్న సమాచారం తెలుసుకున్న నాటుసారా విక్రయ దారులు అక్కడినుంచి పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: వైయస్ఆర్ జలకళ' పథకం ప్రారంభానికి సర్వం సిద్ధం