రూ.10 అడిగితే ఇవ్వలేదని... వ్యక్తిపై కర్రతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగింది. స్థానిక మదీనా మసీదు వద్ద... కూలీ పని చేస్తూ జీవనం సాగించే బాబా ఫక్రుద్దీన్‌ను... అదే ప్రాంతానికి చెందిన హీదాయతుల్లా అనే యువకుడు తరుచూ డబ్బు కోసం వెంటపడుతూ ఉండేవాడు. గురువారం రూ.పది ఇవ్వాలని బాబు ఫక్రుద్దీన్ అడిగాడు. తన వద్ద డబ్బు లేదని చెప్పడంతో... హీదాయతుల్లా ఆగ్రహనికి గురయ్యాడు. సమీపంలో ఉన్న కర్రతో వెంటబడి దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో బాబాఫక్రుద్దీన్ కంటికి బలమైన గాయమైంది. చికిత్స కోసం ధర్మవరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రూ.10 అడిగాడు... ఇవ్వనంటే దాడికి దిగాడు..!
రూ.10 కోసం ఓ వ్యక్తిని తీవ్రంగా గాయపర్చిన ఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగింది. దాడికి పాల్పడిన హీదాయతుల్లా అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు ధర్మవరం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
attacak on person for ten rupess in ananthapuram district