SUICIDE ATTEMPT: మడకశిర పోలీస్స్టేషన్లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం - man Sucide attempt in Madakasira PS
12:36 August 30
మడకశిర మండలం గోడనహళ్లిలో ఘర్షణ కేసుకు సంబంధించి విచారణ
అనంతపురం జిల్లా మడకశిర పోలీస్ స్టేషన్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు కొట్టారని ఆరోపిస్తూ చెన్నయ్య అనే వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే స్పందించిన పోలీసులు చెన్నయ్యను ఆస్పత్రికి తరలించారు.
మడకశిర మండలం గొడనహళ్లిలో నిన్న చెన్నప్పకు మరో వ్యక్తికి ఘర్షణ జరిగింది. ఈ వివాదంలో గాయాలపాలైన చెన్నప్ప.. పోలీసులకు ఫిర్యాదు చేయటానికి వెళ్లాడు. న్యాయం కోసం వెళ్లిన తనను పోలీసులు బెల్టుతో బాదారంటూ ఆరోపిస్తూ బాధితుడు.. గన్నేరు ఆకులను తిని ఆత్మహత్యాయత్నం చేశాడు.
ఇదీ చదవండి