అనంతపురం జిల్లా మడకశిరలోని మట్కా కేంద్రాలపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో 49 మంది మట్కా నిర్వాహకులను అరెస్ట్ చేశారు. నియోజకవర్గానికి నలువైపులా కర్ణాటక ప్రాంతం ఆవరించి ఉంది. దీంతో ఆ ప్రాంతాన్ని అక్రమార్కులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాగా మారుస్తున్నారు. కర్ణాటక అక్రమ మద్యం, మట్కా, గ్యాంబ్లింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారుస్తున్నారు. వీటిపై స్థానిక సీఐ శ్రీరామ్ ప్రత్యేక దృష్టి సారించారు.
RAID: మట్కా కేంద్రాలపై దాడి.. 49 మంది అరెస్ట్ - anatapur district news
15:37 September 06
ARREST
మడకశిర నియోజక వర్గంలోని ఐదు మండలాల్లో.. మట్కా నిర్వాహకులపై ఏకకాలంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పరారైన ఆరుగురి కోసం గాలిస్తున్నారు. పట్టుకున్న వారి నుంచి మెుత్తం రూ. 2.46 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీరామ్ తెలిపారు. మళ్లీ మట్కా నిర్వహణకు పాల్పడితే వారిని జిల్లా బహిష్కరణ చేస్తామని హెచ్చరిస్తూ.. వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఇదీ చదవండి:
వైకాపా నేత బెదిరింపుల కేసులో ట్విస్ట్.. ఎమ్మెల్యేకు సంబంధం లేదన్న గుత్తేదారు సంస్థ