ఓ మహిళ మరణించిన 28రోజుల అనంతరం.. శవపరీక్ష నిర్వహించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో జరిగింది. పట్టణానికి చెందిన శోభదేవి అనారోగ్యంతో మార్చి 21న.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. అయితే శోభదేవి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ.. ఆమె సోదరి స్వర్ణకుమారి ఈ నెల 10న హిందూపురం రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. తహసీల్దార్ శ్రీనివాసులు సమక్షంలో.. మృతదేహాన్ని పూడ్చిన చోటే వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు. శవపరీక్ష నివేదిక వచ్చిన తరువాత.. దీనిపై పూర్తి సమాచారం తెలిసే అవకాశముందని సీఐ మన్సూరుద్దీన్ తెలిపారు.
మహిళ మరణించిన 28రోజులకు శవపరీక్ష - atopsy conducted to women dead body news
అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన ఓ మహిళ మృతిచెందిన 28రోజులకు.. శవపరీక్ష నిర్వహించారు. మహిళ మృతిపై అనుమానం వ్యక్తం చేసిన ఆమె సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు.. తహసీల్దార్ శ్రీనివాసులు సమక్షంలో శవపరీక్ష నిర్వహించారు.
మహిళ మరణించిన 28రోజులకు శవపరీక్ష