ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెళ్లిపొమ్మన్నందుకు దాడి చేశారు..! - అనంతపురం జిల్లా వార్తలు

లాక్​డౌన్ నిబంధనను ఉల్లంఘించి గ్రామంలోకి వచ్చిన వ్యక్తిని అక్కడి నుంచి వెళ్లమనడంతో... గ్రామ వాలంటీర్​పై దాడికి దిగిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో మహిళా వాలంటీర్​కు గాయాలయ్యాయి.

assault on a ward valanteer in ananthapuram district
బాధిత మహిళా వాలంటీర్

By

Published : Apr 26, 2020, 10:47 PM IST

వాలంటీర్​పై దాడి చేసి గాయపరిచిన ఘటన అనంతపురం జిల్లా గుత్తి మండలం లచ్ఛనపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన లక్ష్మి.. వాలంటీర్​గా విధులు నిర్వర్తిస్తున్నారు. విధుల్లో భాగంగా కరోనా వైరస్ పై ఇంటింటి సర్వే చేస్తుండగా రాజంపేటకు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి గ్రామానికి వచ్చాడని తెలిసింది.

లక్ష్మి.. అతడిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించింది. కోపోద్రిక్తుడైన వెంకటేష్ కుటుంబసభ్యులు... ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి దిగారు. ఈ ఘటనలో లక్ష్మికి గాయాలయ్యాయి. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా... లాక్​డౌన్ నిబంధనలను ఉల్లంఘించి గ్రామంలోకి వచ్చిన వెంకటేష్ కుటుంబసభ్యులను గుత్తిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి.

భారత్​లో కరోనా విజృంభణ.. ఒక్కరోజులో 47మంది మృతి

ABOUT THE AUTHOR

...view details