అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అధికార పార్టీకి చెందిన వారు తనపై దాడి చేయించారని రేవన్న అనే వ్యక్తి ఆందోళన వ్యక్తం చేశారు. తనపై జరిగిన దాడికి పట్టణానికి చెందిన రాజకీయ నేతలే కారణమని ఆరోపించారు. పార్టీ గెలుపునకు తన లాంటి వారు విశేషంగా కృషి చేశామని.. అయితే కొంతమంది స్వార్థపరుల కుటిల రాజకీయాలు ఆవేదన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
'వైకాపా నేతలే నాపై దాడికి పాల్పడ్డారు' - కళ్యాణదుర్గంలో ఉద్రిక్తత
అధికార పార్టీకి చెందిన వ్యక్తులు తనపై దాడిచేశారని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఓ వ్యక్తి ఆరోపించారు. పార్టీ కోసం కష్టబడి పని చేస్తున్నా సరైన గుర్తింపు దక్కడం లేదని ఆవేదన చెందారు.
'వైకాపా నేతలే నాపై దాడికి పాల్పడ్డారు'