ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శానిటైజర్‌ తాగి ఏఎస్​ఐ ఆత్మహత్యాయత్నం

అనంతపురం జిల్లా ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఏఎస్​ఐగా విధులు నిర్వహిస్తున్న రమణ... శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. చికిత్స నిమిత్తం రమణను తోటి సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.

By

Published : May 29, 2020, 3:38 PM IST

Updated : May 29, 2020, 5:37 PM IST

శానిటైజర్‌ తాగి ఏఎస్​ఐ ఆత్మహత్యాయత్నం
శానిటైజర్‌ తాగి ఏఎస్​ఐ ఆత్మహత్యాయత్నం

అనంతపురంలోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రమణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అనంతపురం కలెక్టర్​లో విధులు నిర్వహిస్తున్న సమయంలో... తన దగ్గర ఉన్న శానిటైజర్ తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఇది గమనించిన తోటి సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు.

Last Updated : May 29, 2020, 5:37 PM IST

ABOUT THE AUTHOR

...view details