వైకాపా నాయకులు లైంగికంగా వేధించారంటూ అనంతపురం జిల్లా చెర్లోపల్లిలో.. ఆశాకార్యకర్త ఆత్మహత్యకు యత్నించింది. అదే గ్రామానికి చెందిన నాలుగురు నాయకులు.. లైంగికంగా నిత్యం వేధించేవారని వాపోయింది. తమ మాట వినకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తామని బెదిరించారని తెలిపింది. వారి వేధింపులు తట్టుకోలేక మనస్థాపం చెంది.. వాస్మల్ నూనె తాగి ఆత్మహత్యకు యత్నించానని తెలిపింది. ఈ ఘటనపై బాధితురాలి వాంగ్మూలం తీసుకున్న రాప్తాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వైకాపా నాయకులు లైంగికంగా వేధించారని... ఆశా కార్యకర్త ఆత్మహత్యాయత్నం - వైకాపా నాయకులు లైంగిక వేధింపులు వార్తలు
వైకాపా నాయకులు లైంగిక వేధింపులు తట్టుకోలేక... ఆశా కార్యకర్త ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన అనంతపురం జిల్లా చెర్లోపల్లిలో జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
వైకాపా నాయకులు లైంగికంగా వేధించారని... ఆశా కార్యకర్త ఆత్మహత్యాయత్నం