ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వంద అడుగుల జెండాతో... వంద మంది విద్యార్థుల ప్రదర్శన - One hundred feet flag news in Madakashira

జాతీయ జెండాకు రూపకల్పన చేసి నేటికి వందేళ్లు పూర్తయ్యింది. అనంతపురం జిల్లా మడకశిరలో అరుణోదయ పాఠశాల యాజమాన్యం... ఈ వేడుకను వినూత్నంగా నిర్వహించింది. 100 అడుగుల జెండాను వందమంది విద్యార్థులతో ప్రదర్శన చేయించింది. పింగళి వెంకయ్యకు నివాళులు అర్పించింది.

వంద అడుగుల జెండాతో... వంద మంది విద్యార్థుల ప్రదర్శన
వంద అడుగుల జెండాతో... వంద మంది విద్యార్థుల ప్రదర్శన

By

Published : Mar 31, 2021, 6:38 PM IST

జాతీయ జెండా ఆవిష్కరణకు వందేళ్ల చరిత్రను పురస్కరించుకొని అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని అరుణోదయ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం 100 అడుగుల జాతీయ జెండాను రూపొందించింది.

పింగళి వెంకయ్యకు ఘనంగా నివాళులు అర్పించి... 100 మంది విద్యార్థులతో ప్రదర్శన నిర్వహించింది. పాఠశాల యాజమాన్య, అధ్యాపక బృందంతో పాటు.. విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శనలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details