ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అర్షి స్కిన్, హెయిర్‌ క్లినిక్‌ యాజమాన్యం దాతృత్వం... రోగ నిరోధక మాత్రలు అందజేత - arshi skin, hair clinic latest news

అర్షి స్కిన్, హెయిర్ క్లినిక్ యాజమాన్యం తమ ఉదారతను చాటుకున్నారు. హిందూపురం నియోజకవర్గానికి, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి రోగులకు రూ.30 లక్షలు విలువ చేసే రోగనిరోధక మాత్రలను అందజేశారు. ఆ మేరకు తెదేపా ఓ ప్రకటనలో పేర్కొంది.

donation
అర్షి స్కిన్, హెయిర్‌ క్లినిక్‌ యాజమాన్యం దాతృత్వం

By

Published : May 6, 2021, 7:50 AM IST

హిందూపురం నియోజకవర్గ ప్రజలకు, బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్యాన్సర్‌ రోగులకు అర్షి స్కిన్, హెయిర్‌ క్లినిక్‌ యాజమాన్యం రూ.30 లక్షలు విలువ చేసే రోగనిరోధక మాత్రలు అందజేసినట్లు తెదేపా ఓ ప్రకటనలో తెలిపింది. క్లినిక్‌ అధినేత డా.వీఎస్‌బీ బండి, డా.అన్నపూర్ణలు ఈ మందులను ఆసుపత్రి రీసెర్చి ఇనిస్టిట్యూట్‌ సీఈవో ఆర్‌వీ ప్రభాకర్‌రావుకు అందజేసినట్లు పేర్కొంది. అర్షి స్కిన్, హెయిర్ క్లినిక్ యాజమాన్యం చూపిన దాతృత్వం హిందుపురం ప్రజలతో పాటూ క్యాన్సర్ రోగులను ఎంతో మేలు చేస్తుందని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఇంతటి ఉదారత చూపిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details