అనంతపురం జిల్లా నంబుల పూల కుంట మండలం సారగుండ్లపల్లి బోడి బండరాయి స్వామి గుడి వద్ద రైస్ పుల్లింగ్ చేస్తున్న ఐదుగురు వ్యక్తులను కదిరి పోలీసులు అరెస్ట్ చేశారు. శిథిలావస్థకు చేరుకున్న ఆలయాలను లక్ష్యంగా చేసుకోని.. రైస్ పుల్లింగ్ పేరుతో గోపురాల పైన ఏర్పాటు చేసే కలశాలకు శక్తి ఉందంటూ ప్రజలను నమ్మిస్తున్నారు. వారి నుంచి పెద్ద మెుత్తంలో డబ్బులు చేసేవారు. సమాచారం అందుకున్న పోలీసులు వారి గుట్టును రట్టు చేశారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో వీరిపై కేసులు ఉన్నట్లు కదిరి డిఎస్పీ షేక్ లాల్ అహ్మద్ తెలిపారు.
రైస్‌పుల్లింగ్ చేస్తున్న ఐదుగురి అరెస్ట్ - అనంతపురం జిల్లాలో ఐదురుగు అరెస్ట్
రైస్ పుల్లింగ్ పేరుతో ప్రజలను మోసగిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను కదిరి పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి కారును, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
రైస్‌పుల్లింగ్ చేస్తున్న ఐదుగురి అరెస్ట్