Ministers Bus Yatra in Ananthapuram: అనంతపురం జిల్లాలో ఈరోజు మంత్రుల సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర జరగనుంది. ఈ సందర్భంగా వివిధ వర్గాల నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. తెలుగుదేశం, ఎంఆర్పీఎస్, ఇతర ఎస్సీ సంఘాల నాయకులను అరెస్టు చేసి శింగనమల, బుక్కరాయసముద్రం స్టేషన్లకు తరలించారు. బలహీనవర్గాలకు అన్యాయం చేసిన వైకాపా... బస్సు యాత్ర పేరిట మోసం చేస్తోందని తెలుగుదేశం సహా ఇతర సంఘాల నాయకులు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మనుషులకు సంకెళ్లు వేసినా, మనసులకు వేయలేమనే విషయాన్ని గుర్తించాలని ఆయా సంఘాల నాయకులు అన్నారు.
అనంతలో 'సామాజిక బస్సు యాత్ర'.. పలువురు ముందస్తు అరెస్ట్ - Ministers Bus Yatra in Ananthapuram
Arrests in Ananthapuram: అనంతపురం జిల్లాలో మంత్రుల సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర సందర్భంగా వివిధ వర్గాల నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. మనుషులకు సంకెళ్లు వేసినా, మనసులకు వేయలేమనే సంగతి గుర్తించాలని ఆయా సంఘాల నాయకులు అన్నారు.
Arrests in Ananthapuram