ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటుసారా తరలిస్తున్న నలుగురు వ్యక్తుల అరెస్టు - News on natu sara at guthi

అనంతపురం జిల్లా గుత్తిలో నాటుసారా తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 85 లీటర్ల నాటుసారాతో పాటు మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

Arrest of four people moving natusara at guthi
నాటుసారా తరలిస్తున్న నలుగురు వ్యక్తుల అరెస్టు

By

Published : Oct 10, 2020, 11:31 AM IST

అనంతపురం జిల్లా గుత్తి మండల కేంద్రంలో నాటుసారా అక్రమంగా తరలిస్తున్న నలుగురు వ్యక్తులను స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నాటుసారా అక్రమంగా తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించామని స్థానిక సీఐ సుభాషిని అన్నారు. అందులో భాగంగా నాటు సారా అక్రమంగా తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామని తెలిపారు. వారి వద్ద నుంచి 85 లీటర్ల నాటుసారాతో పాటు మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు. ఎవరైనా నాటుసారా అక్రమంగా నిల్వ ఉంచి విక్రయించినా, అక్రమంగా రవాణా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details