అనంతపురం జిల్లా కదిరిలో ఈ నెల 20వ తేదీన జరిగిన హత్య కేసు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరుకు చెందిన షేక్వలి బాష, అతని స్నేహితుడు ముజాహిద్ ఈ నేరాన్ని చేసినట్లు అంగీకరించారు. నిందితులను కూటగుళ్ల వద్ద పట్టుకుని అరెస్టు చేశారు. వారి నుంచి ద్విచక్ర వాహనం, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
హత్య కేసు నిందితుల అరెస్టు - అనంతపురం జిల్లా క్రైం
కదిరిలో ఈనెల 20న జరిగిన హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
హత్య కేసు నిందితుల అరెస్టు