అనంతపురంలోని దిశా పోలీస్ స్టేషన్‌ను అర్జాస్ స్టీల్స్ ఎండీ శ్రీధర్ కృష్ణ మూర్తి, శ్రీ మ్యాక్సీ ఫెర్నాండెస్ వైస్ ప్రెసిడెంట్ కె.ఎం. రామ్ ఇతర ప్రతినిధులు సందర్శించారు. దిశా పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి అర్జాస్ స్టీల్స్ ఆర్థిక సహకారం అందించింది. వీరికి జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు ఘన స్వాగతం పలికారు. దిశా పోలీస్ స్టేషన్లో మహిళలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం చొరవ తీసుకోవడం అభినందనీయమని శ్రీధర్ కృష్ణ మూర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో దిశా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీనివాసులు, అనంతపురం ఎస్పీడీఓ వీర రాఘవ రెడ్డి , రాము, సంబశివారెడ్డిలు హాజరయ్యారు.
దిశా పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన అర్జాస్ స్టీల్స్ ఎండీ - అనంతపురం దిశా పోలీస్‌స్టేషన్
అనంతపురంలోని దిశాపోలీస్ స్టేషన్‌ను అర్జాస్ స్టీల్స్ ఎండీ శ్రీధర్ కృష్ణ మూర్తి, శ్రీ మ్యాక్సీ ఫెర్నాండెస్ వైస్ ప్రెసిడెంట్ కె.ఎం. రామ్ సందర్శించారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం చొరవ తీసుకోవడం అభినందనీయమని అన్నారు.
దిశా పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన అర్జాస్ స్టీల్స్ ఎండీ