ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పెనుకొండలోని పురాతన విగ్రహాలపై వస్తున్న పుకార్లలో నిజం లేదు' - పెనుకొండ గగనమహల్ తాజా సమాచారం

పెనుకొండలో పురాతన విగ్రహాలపై వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని పురావస్తు శాఖ అధికారి రజిత పేర్కొన్నారు. వీటిని మ్యూజియంలో పెట్టటం కోసం సేకరించినట్లు వివరించారు.

archaeological Survey of India
పెనుకొండలోని పురాతన విగ్రహాలు పై వస్తున్న వార్తలన్ని అవాస్తవం

By

Published : Jan 17, 2021, 8:35 AM IST

అనంతపురం జిల్లా పెనుకొండలో పురాతన విగ్రహాలు పగలగొట్టారని వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని పురావస్తు శాఖ అధికారి రజిత స్పష్టం చేశారు. పెనుకొండలోని గగనమహల్ వద్ద ఉంచిన పాత విగ్రహాలను ఆమె పరిశీలించారు. ఇవి ఇప్పుడు పగలిపోయినవి కాదని చెప్పారు.

2014లో మ్యూజియం ఏర్పాటు చేసి అక్కడ వీటిని పెట్టటం కోసం సేకరించినట్లు వివరించారు. ఇటీవల సామాజిక మాద్యమాల్లో విగ్రహాలు పగలగొట్టారని వచ్చిన వార్తలు కేవలం అపోహ మాత్రమేనని ఆమె వివరించారు. ఆమె వెంట పెనుకొండ సీఐ శ్రీహరి, ఎస్సై వెంకటేశ్వర్లు, ఇతర సిబ్బంది ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details