Save AP Police: పోలీసులకు చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం స్పందించడం లేదంటూ.. అనంతపురం జిల్లాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతపురంలోని పోలీసు కార్యాలయ ఆవరణలో పోలీసు అమరవీరుల స్తూపం వద్ద ‘ఏపీ సీఎం జగన్ సార్.. సేవ్ ఏపీ పోలీస్, గ్రాంట్ ఎస్‌ఎల్‌ఎస్, ఏఎస్‌ఎల్‌ఎస్ అరియర్స్.. సామాజిక న్యాయం ప్లీజ్’ అంటూ ప్లకార్డు ప్రదర్శించారు.
Save AP Police: 'సేవ్ ఏపీ పోలీస్..' ప్లకార్డుతో ఏఆర్ కానిస్టేబుల్ నిరసన - సేవ్ ఏపీ పోలీస్ ప్లకార్డుతో కానిస్టేబుల్ నిరసన
Save AP Police: పోలీసులకు చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం స్పందించడం లేదంటూ.. అనంతపురం జిల్లాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ నిరసన వ్యక్తం చేశారు. ‘ఏపీ సీఎం జగన్ సార్.. సేవ్ ఏపీ పోలీస్, గ్రాంట్ ఎస్‌ఎల్‌ఎస్, ఏఎస్‌ఎల్‌ఎస్ అరియర్స్.. సామాజిక న్యాయం ప్లీజ్’ అంటూ ప్లకార్డు ప్రదర్శించారు.
సేవ్ ఏపీ పోలీస్.. ప్లకార్డుతో ఏఆర్ కానిస్టేబుల్ నిరసన
తమకు మూడు సరెండర్ లీవ్స్, అదనపు సరెండర్ లీవ్స్‌కు సంబంధించిన మొత్తం రాలేదని ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులకు 14 నెలలకు సంబంధించి రవాణా భత్యం, ఆరు డీఏ బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించినట్లు ఆడిట్‌లో చూయించి.. వాటిపై పన్ను వసూలు చేశారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది పోలీసులు ఈ విషయమై ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: