ప్రియాంకగాంధీ అరెస్టును ఏపీసీసీ అధ్యక్షులు శైలజనాథ్ ఖండించారు. రైతుల పక్షాన ఉద్యమిస్తున్న ప్రియాంక గాంధీని అరెస్టు చేయటాన్ని వ్యతిరేకిస్తూ.. అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన నిర్వహించింది. ఆర్ఎస్ఎస్ విధానాలతో దేశాన్ని పాలిస్తున్న భాజపా ప్రభుత్వం రైతుల మరణాలకు కారణమైందని శైలజనాథ్ విమర్శించారు.
SAILAJANATH: రైతుల మరణాలకు భాజపా కారణం: శైలజనాథ్ - ఏపీపీసీసీ అధ్యక్షులు శైలజనాథ్
ప్రియాంకాగాంధీ అరెస్టును ఏపీసీసీ అధ్యక్షులు శైలజనాథ్ ఖండించారు. ఆమెను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఏపీపీసీసీ అధ్యక్షులు శైలజనాథ్
రైతులను హత్యచేసిన నిందితులను వదిలేస్తున్నారని..ఉద్యమించిన వారిని నిర్బంధిస్తున్నారని ఆయన ఆరోపించారు. అరెస్టులు, ఆరాచకాలు దీర్ఘకాలం కొనసాగించలేరని కేంద్ర ప్రభుత్వాన్ని శైలజానాథ్ హెచ్చరించారు.
ఇదీ చదవండి:BJP MAHA DHARNA: రైతు సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ విఫలం: సోము వీర్రాజు