PRC: సంక్రాంతి కానుకగా పీఆర్సీ ఇవ్వకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ఏపీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాధవ్ హెచ్చరించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అనంతపురం జిల్లావ్యాప్తంగా పర్యటించిన ఏపీఎన్జీవో కమిటీ.. నేడు మడకశిరలో నిరనన వ్యక్తం చేసింది.
మీడియాతో మాట్లాడిన మాధవ్.. పీఆర్సీ అమలు చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని మండిపడ్డారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయటంలోనూ నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్ పాదయాత్రలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చాలని మాధవ్ డిమాండ్ చేశారు.